రాష్ట్ర రాజధాని హైదరాబాదును ఏడో తేదీ టెన్షన్ పట్టుకుంది. ఈ నెల 7వ తేదీన ఎపిఎన్జీవోల సభకు అనుమతి ఇచ్చి తమ శాంతి ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించడంపై తెలంగాణవాదులు భగ్గుమంటున్నారు. సమైక్యాంధ్ర నినాదంతో ఈ నెల 7వ తేదీన ఎపిఎన్జీవోలు ఎల్బీ స్టేడియంలో సభను తలపెట్టారు. అదే రోజు నిజాం కళాశాల మైదానంలో తెలంగాణ ఎన్జీవోలు శాంతిర్యాలీకి అనుమతి కోరారు. సమైక్యాంధ్ర సభకు అనుమతి ఇస్తూ తమకు అనుమతి నిరాకరించడంపై ఆగ్రహంగా ఉన్న తెలంగాణ జెఎసి నాయకులు ఆ రోజు బంద్‌కు పిలుపు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సమైక్యాంధ్ర సభను దెబ్బ కొట్టడానికి అంతకన్నా మార్గం లేదనే ఉద్దేశంతో తెలంగాణవాదులు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ జెఎసి బంద్‌కు పిలుపునిస్తే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), ఓయు జెఎసి, బిజెపి మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి. బంద్‌కు పిలుపునిచ్చి హైదరాబాదుకు వచ్చే మార్గాలను దిగ్బంధం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు 4 గం టలకు జరిగే స్టీరింగ్ కమిటీ సమావేశంలో బంద్‌పై తెలంగాణ జెఎసి నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వం సీమాంధ్రకు అనుకూలంగా వ్యవహరిస్తోందనేది 7వ తేదీన ఎపిఎన్జీవోల సభకు అనుమతి ఇవ్వడం ద్వారా అర్థమవుతోందని తెలంగాణవాదులు అంటున్నారు. ఈ విషయంపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేకు కూడా ఫిర్యాదు చేశారు . ఎల్బీ స్టేడియంలో జరిగే సీమాంధ్ర సభను తాము అడ్డుకుంటామని, అదే సమయంలో నిజాం కళాశాల మైదానంలో శాంతి ర్యాలీ జరిపి తీరుతామని తెలంగాణవాదులు అంటున్నారు. తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ స్వయంగా ఆ మాట అన్నారు. ప్రభుత్వ తీరుపై తెలంగాణ మంత్రి కె. జానా రెడ్డి కూడా మండిపడుతున్నారు. రెండు సభలకు అనుమతి నిరాకరించాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎపిఎన్జీవోల సభకు వ్యతిరేకంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధపడుతున్నారు. నిజాం కళాశాల మైదానంలో జమై, తెలంగాణ అమర వీరుల స్థూపం వరకు ర్యాలీ నిర్వహించే ఉద్దేశంతో వారు ఉన్నట్లు తెలుస్తోంది. నిజాం కళాశాల, ఎల్బీ స్టేడియం రోడ్డుకు ఇరు వైపులా ఉంటాయి. రెండు ప్రాంతాల శిబిరాలు ఇరు వైపులా మోహరిస్తే పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. ఏడో తేదీన విద్యాసంస్థల బంద్‌కు ఓయు జెఎసి పిలుపునిచ్చే అవకాశం ఉంది. ఏడో తేదీన థియేటర్లు మూసేయాలని కూడా ఓయు జెఎసి నాయకులు పిలుపునిచ్చారు. హైదరాబాద్ వచ్చే సీమాంధ్ర ఉద్యోగులను అడ్డుకోవడానికి వారు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్ 7 న తెలంగాణా బంద్ ?
-
by chitriyala venkat 00:08

About The Author
Ut dignissim aliquet nibh tristique hendrerit. Donec ullamcorper nulla quis metus vulputate id placerat augue eleifend. Aenean venenatis consectetur orci, sit amet ultricies magna sagittis vel. Nulla non diam nisi, ut ultrices massa. Pellentesque sed nisl metus. Praesent a mi vel ante molestie venenatis.
Related Posts
- సెప్టెంబర్ 7 న తెలంగాణా బంద్ ?
- Aadhaar to be linked with caste, domicile certificates
- You will go ‘Aam Admi’ way: Congress warns TRS
- హైకోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు నుంచి ఒక్కొక్కరికి విముక్తి : దాల్మియాకు ఊరట
- వయసులో చిన్నోడే అయినా కేటీఆర్, చంద్రబాబుని చాలా గట్టిగా దెబ్బ కొట్టేశారు
- భూమా నాగిరెడ్డి , జలీల్ ఖాన్, జ్యోతుల నెహ్రూ వంటి వాళ్లు చేతగాని శౌర్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
- Assembly Elections to be postponed!
- Election notification this month end
- 2014 నుంచి చంద్రబాబు నాయుడు చేసిన గొప్ప (డబ్బా) పనులు
- వైఎస్ జగన్ పైన పెట్టిన కేసులు ఎప్పటికి నిలబడవు
- తెలంగాణలో కొత్త ట్రాఫిక్ రూల్స్ ను అమలు చేయబోతున్నారు.
- Vijay Mallya arrested in London
- Who is Pawan Kalyan? What is Jana Sena?: AAP in-charge Somnath Bharti
Trading Videos
Popular Posts
-
Grand welcome for Ys Jagan Mohan Reddy at home
-
Pawan Kalyan's Psychological Problem?
-
క్షమించమంటూ...పవన్ కళ్యాణ్ వద్దకు కాళ్ల బేరం?
-
Rajya Rani Express runs over at least 20 people in Bihar
-
‘Ram Leela’ music launch cancelled for Ranveer Singh
-
ABCD Movie Review
-
Don’t care for page 3 party’s says Mahesh Babu
-
Yahoo bonds with 'Google' for online ads
-
Rare Photos Of Operation Polo / Hyderabad Police Action 1948
-
NTR's Ramayya Vastavayya 6 Days Collections
0 comments