న్యూఢిల్లీ: హైదరాబాదు రాజధానిగా తెలంగాణ ఏర్పాటుకు కేబినెట్ నోట్ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇరవై రెండు పేజీలతో కేంద్ర హోంశాఖ కేబినెట్ నోట్‌ను సిద్ధం చేసిందని తెలుస్తోంది. ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో దీనిని ఆమోదించి ఆ తర్వాత అసెంబ్లీ తీర్మానానికి పంపించనున్నట్లు తెలుస్తోంది.
సీమాంధ్ర రాజధాని బాధ్యతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించనుందని తెలుస్తోంది. ఉమ్మడి రాజధాని పైన మరో బిల్లును తేనున్నారని తెలుస్తోంది. నదీ జలాలు, ఇతర సమస్యల పైన మంత్రివర్గ ఉపసంఘాన్ని వేయనున్నారు. ఈ రోజు సాయంత్రం జరగనున్న కేబినెట్ సమావేశానికి నోట్ రానుంది.
ఈ నోట్‌ను అందరికీ ఇచ్చినట్లుగా సమాచారం. ప్రధాని వచ్చాక వేగవంతం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇటీవల ప్రత్యేక విమానంలో మాట్లాడుతూ తమ తొలి ప్రాధాన్యత తెలంగాణనే అని చెప్పిన విషయం తెలిసిందే. ప్రధాని భారత్‌కు తిరిగి వచ్చాక తెలంగాణ నోట్ వేగవంతమైనట్లుగా తెలుస్తోంది. ఈ రోజు కేబినెట్‌కు రానున్న నోట్లో ఇరవై రెండు పేజీలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిని అందరికీ పంచారని సమాచారం.
కేబినెట్ నోట్‌లు పలు అంశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. నదీ జలాలు, ఇతర సమస్యల పరిష్కారానికి మంత్రుల ఉపసంఘం, భద్రాచలం నిర్ణయంపై స్పష్టత, సీమాంధ్ర రాజధాని నిర్ణయం బాధ్యత ఎపి ప్రభుత్వంపై తదితర అంశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం ఐదుగంటలకు జరగనున్న సమావేశంలో టేబుల్ ఎజెండా రూపంలో కేబినెట్ ముందుకు తెలంగాణ నోట్ వచ్చే అవకాశముంది.
0 comments