తెలుగు సినిమా చరిత్రలో ఆల్ టైమ్ టాప్ 2 హిట్‌గా నిలిచిన ‘అత్తారింటికి దారేది’ మూడవ వారంలో కూడా వసూళ్లు అదరగొడుతోంది. దసరా పండక్కి ప్రేక్షకులకి ఇదే ఫస్ట్ ఛాయిస్ ఫిలిం అయింది. నైజాంలో ఆల్రెడీ ఇరవై కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం కర్నాటకలో అయిదు కోట్ల షేర్ వెనకేసుకుంది. మగధీర తర్వాత కర్నాటకలో అయిదు కోట్ల షేర్ తెచ్చుకున్న తెలుగు చిత్రమిదే.
నైజాంలో మగధీర తర్వాత ఇరవై కోట్లు షేర్ రాబట్టిన సినిమా కూడా ‘అత్తారింటికి దారేది’. సోమవారం, మంగళవారం నాడు కూడా వసూళ్లు చాలా బాగున్నాయి. కొత్తగా విడుదలైన ‘రామయ్యా వస్తావయ్యా’ ఎక్కువ థియేటర్లలో ఉన్నా కానీ దానికంటే తక్కువ థియేటర్స్‌లో ప్రదర్శితమవుతున్న ‘అత్తారింటికి దారేది’ ఎక్కువ గ్రాస్ రాబడుతోంది.
ఈ చిత్రం అరవై అయిదు కోట్ల షేర్‌ని దాటి 70 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. ఇంకో వారం పాటు ఇలాగే వసూళ్లు వచ్చినట్టయితే ఆ ఫీట్ సాధించడం అంత కష్టమేం కాదు. మగధీర తర్వాత ఇంత వసూలు చేసిన సినిమా ఇదే. రెండవ వారంలో బంద్‌లు, విద్యుత్ సమ్మెలు ఎదురుకాకపోయి ఉంటే మరో నాలుగైదు కోట్లు ఈజీగా వచ్చి ఉండేవని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.
0 comments