రాయపూర్: చత్తీస్‌గడ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌లో ఘోరం జరిగింది. బిలాస్‌పూర్‌లోని రైల్వే స్టేషన్ వద్ద ఓ మహిళపై మూడు రోజుల క్రితం సామూహిక అత్యాచారం జరిగింది.
నలుగురు వ్యక్తులు ఓ మహిళపై అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు అందింది. నలుగురిలో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మహిళ ఫిర్యాదు చేయగానే పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు రైలు ఎక్కి, సంఘటనా స్థలం నుంచి పారిపోయినట్లు భావిస్తున్నారు.
సరుగ్జా ప్రాంతంలోని బైకుంఠాపురంలో గల తన అత్తారింటికి వెళ్లడానికి మహిళ శుక్రవారం ఐదో నెంబర్ ప్లాట్‌ఫాంపై నిలబడింది. ఆమెను నలుగురు యువకులు బలవంతంగా లాక్కెళ్లి ఆమెపై అత్యాచారం జరిపారు. నిందితుల్లో ఒకతన్ని 26 ఏళ్ల దినేష్ సాహుగా పోలీసులు గుర్తించారు. అతను కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. మరో నిందితుడు మైనర్ అని తెలుస్తోంది. మరో ఇద్దరిని పట్టుకోవడానికి వివిధ ప్రాంతాలకు పోలీసులను పంపించారు.
బిలాస్‌పూర్ రైల్వే స్టేషన్‌లోనూ, దాని పరిసర ప్రాంతాల్లోనూ ఇటీవలి కాలంలో నేరాలు పెరిగిపోయాయి. ఆగస్టులో ఏడేళ్ల బాలికపై బిలాస్‌పూర్ సమీపంలో హౌరా ఎక్స్‌ప్రెస్‌లో అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.
0 comments