`1` అవుట్ పుట్ పట్ల మహేష్ బాబు పూర్తి సంతృప్తితో ఉన్నాడు. ఈ సినిమా అందరి అంచనాలను అందుకొంటుందని, తన కెరీర్‌లో మైలు రాయిగా నిలిచిపోతుందని మహేష్ ట్విట్ చేశాడు. క్వాలిటీ విషయంలో నిర్మాతలెక్కడా రాజీ పడలేదని అందుకే ఈ సినిమా ఆలస్యమైందని మహేష్ చెబుతున్నాడు. ఇంత మంచి సినిమా ఇచ్చినందకు వన్ టీమ్‌కి మహేష్ కృతజ్ఞతలు తెలిపాడు.
మహేష్ కి ట్విట్టర్ ఎకౌంట్ ఉన్నా... సాధారణంగా అందులోంచి సందేశాలు పంపడు. ఎంతో హ్యాపీ మూడ్‌లో ఉంటే తప్ప. ఇప్పుడు వన్ టీమ్‌కి థ్యాంక్స్ చెప్పడానికి ప్రిన్స్ ట్విట్టర్ ఓపెన్ చేశాడంటే ఈ సినిమా సమ్ థింగ్ స్పెషల్ అనే చెప్పాలి. దానికి తోడు ఆడియో ఫీలర్‌కి వస్తొన్న స్పందన పట్ల కూడా మహేష్ హ్యాపీగా ఉన్నాడు. ఈ హ్యాపీ హ్యాపీ మూడ్‌లో `1` పాటలు ఈ రోజే విడుదల చేసేస్తున్నారు.
0 comments