సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న రెండు పెద్ద సినిమాల్లో ఇప్పుడు ఖచ్చితంగా ‘1 నేనొక్కడినే’పైనే ఎక్కువ అంచనాలున్నాయి. హ్యాట్రిక్ హిట్స్ అందుకుని కెరీర్‌లో బెస్ట్ ఫేజ్‌లో ఉన్న మహేష్‌బాబు ఇప్పుడు పట్టిందల్లా బంగారమవుతోంది. ప్రతి సినిమాకీ వేరియేషన్ చూపిస్తూ, నటుడిగా కూడా మెప్పిస్తూ దూసుకుపోతున్న మహేష్‌బాబు ఈసారి ‘1’తో కూడా ప్రేక్షకులకి వెరైటీ వినోదాన్ని అందించబోతున్నాడు.
సంక్రాంతి సినిమాల్లో దీనికే ‘ఫస్ట్ ఇన్’ అడ్వాంటేజ్ దక్కబోతోంది. ‘రామయ్యా వస్తావయ్యా’ తర్వాత భారీ అంచనాలతో వస్తున్న సినిమా ఇదే. అంటే పెద్ద సినిమా వచ్చి మూడు నెలల గ్యాప్ వచ్చేసిందన్నమాట. చాలా గ్యాప్ తర్వాత వచ్చే పెద్ద సినిమాలకి ప్రేక్షకులు ఏ విధంగా ఎగబడతారనేది మనకి తెలియనిది కాదు. ‘దూకుడు’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలు వాటికి మంచి ఉదాహరణ.
‘1’ కనుక ఏమాత్రం అంచనాలకి తగ్గట్టు ఉన్నా కానీ తదుపరి రిలీజ్ అయ్యే సినిమాలపై ప్రభావం తీవ్రంగా ఉంటుంది. డీసెంట్ టాక్ వచ్చినట్టయితే సంక్రాంతికి మహేష్ రికార్డులు తుడిచిపెట్టేసినా ఆశ్చర్యం లేదు. ఇక అంతా ఫస్ట్ షోకి వచ్చే పబ్లిక్ టాక్‌పై డిపెండ్ అయి ఉంది.
0 comments