హీరో మహేష్ బాబు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్తున్నారు. అయితే నరేంద్ర మోడీ ని కలుస్తారా ? లేదా ? అనే విషయం మాత్రం సస్పెన్స్. ఇంతకీ మహేష్ బాబు పొలిటికల్ లీడర్ కాదు, రాజకీయాల్లోకీ రావడం లేదు. అలాంటప్పుడు నరేంద్ర మోడీ ని కలవాలసిన అవసరం మహేష్ బాబు కు ఏమిటి అనే అనుమానం ఎవ్వరికైనా వస్తుంది.
అదే మరి ఇక్కడ ట్విస్ట్. హీరో మహేష్ బాబు గుజరాత్ వెళ్తోంది ఆగడు సినిమా షూటింగ్ కోసం. గుజరాత్ అంటే నరేంద్ర మోడీ ,....మోడీ అంటే గుజరాత్ కదా మరి. అందుకే మహేష్ నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్తున్నాడు అని చెప్పాం. ఈ నెల 18 నుంచి ఆగడు సినిమా షూటింగ్ గుజరాత్ లో జరుగనుంది. ఇంతకు ముందు కొద్ది రోజులు జరిగిన షూటింగ్ లో కామెడి సన్నివేశాలను చిత్రీకరించారు. 18 నుంచి మహేష్ పై కీలకమైన సన్నివేశాలను గుజరాత్ లో చిత్రీకరించనున్నారు.
దీనికి కోసం దర్శకుడు శ్రీను వైట్ల, కెమెరామెన్ తో కలసి గుజరాత్ లో లొకేషన్ చూడ్డానికి వెళ్ళారు. వన్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న మహేష్ వెంటనే ఆగడు సినిమా షూటింగ్ కు వెళ్లనున్నాడు. శ్రీను వైట్ల, మహేష్ కాంబినేషన్ లో తొలి సారిగా వచ్చిన దూకుడు సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మరి ఆగడు ఏమవుతుందో చూద్దాం.

0 comments