తెర వెనక ఉండే వ్యక్తులకు గుర్తింపు రావడమే ఇండస్ట్రీలో చాలా కష్టం. అటువంటింది ఇక ఫాలోయింగ్ గురించి మాట్టాడటం అంటే..ఉట్టికేగరలేని అమ్మ స్వర్గానికి నిచ్చెన వేసిన చందంగా అనిపిస్తుంది.అయితే రాజమౌళి లాంటి దర్శకులు మాత్రం బియాండ్ లైన్స్ అన్న చందంగా దర్శకుడిగా స్టార్ హీరోల రేంజ్ ఫాలోయింగ్ ను గెయిన్ చేశాడు.ఆయన చేసిన చిత్రాలు.. చూపిన వైవిధ్యం.. సాంకేతిక ఎక్స్ లెన్సీ కి తోడు..పరిశ్రమలో ఆయనకున్న క్లీన్ ఇమేజ్ ..ఆయన ప్రవర్తన. ,,ఈ అంశాలన్ని రాజమౌళి ని స్టార్ డైరెక్టర్ గా ఫాలోయింగ్ తెచ్చాయి.
ఇక అసలు విషయం ఏమిటంటే.. ప్రస్తుతం రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఉద్యమం జరుగుతోంది. మరి రాజమౌళి ఏ స్టాండ్ తీసుకుంటాడు. విభజన సమర్థించి.. జై తెలంగాణ అంటాడా..లేక స్టేట్ ఐక్యంగా ఉంటేనే బెటరని సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తాడా.? జస్ట్ గెస్ ఇట్. చాలా మంది రాజమౌళి ఆంధ్రప్రాంతానికి చెందిన వాడు కాబట్టి… సమైక్యాంధ్రకే మద్దతు ఇస్తాడని చెప్పోచు . కానీ.. రాజమౌళి ఈ విషయంలో కూడా తటస్థంగానే ఉన్నాడండోయ్. కరవ మంటే కప్పకు కోపం ..విడవ మంటే పాముకు కోపం కాబట్టి..రాజమౌళి స్టేట్ విడిపోయినా..విడిపోక పోయిన.. తెలుగు వారిగా మనం అందరం ఐక్యంగానే ఉండాలంటూ చెప్పారు. ఈ మధ్య ఒక ప్రముఖ ఛానెల్ నిర్వహించిన యంగిస్థాన్ కార్యక్రమానికి అతిథిగా వెళ్లినప్పుడు జరిగింది ఇదంతా. ఇక ప్రస్తుతం 100 కోట్ల బడ్జెట్ తో “బాహు బలి”ని చెక్కుతున్న విషయం తెలిసిందే. ఆర్ ఎఫ్ సి లో వేసిన సెట్స్ ను రామోజీరావు సందర్శించి ..స్వయంగా ఆయన మంత్ర ముగ్ధుడై రాజమౌళి కి ఒక అభినందన ఉత్తరం రాసిన సంగతి కూడా తెలిసిందే.
0 comments