స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయనగానే...ఆ సినిమా టైటిళ్ల లోగోలతో టీషర్టులను మార్కెట్లోకి వదలడం, అభిమానులు వాటిని ధరించి తమ అభిమాన హీరోకు మరింత ప్రచారం కల్పించడం కామన్ అయిపోయింది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా ‘1'(నేనొక్కడినే) లోగోలతో కూడిన టీషర్టులు కూడా మార్కెట్లోకి వచ్చి హల్ చల్ చేస్తున్నాయి. ‘1'(నేనొక్కడినే) సినిమా విషయానికొస్తే....కృతి సనన్ హీరోయిన్. సుకుమార్ దర్శకుడు. 14రీల్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా రూపొందించిన సెట్‌లో షూటింగ్ జరుగుతోంది.
మహేష్ బాబు...ఓ ఇరవై రోజులు పాటు బ్యాంకాక్ లో మకాం వేయనున్నారు. అక్కడ ఆయనపై ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ లు తీయనున్నారు. ఈ షూటింగ్ తో నవంబర్ నెలఖారుతో పూర్తి కానుంది. ఆడియో డిసెంబర్ మూడవ వారంలో విడుదల కానుంది. సాయాజి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంలో ఆచంట రామ్, ఆచంట గోపీచంద్, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.
0 comments