ఆయన నడక చూస్తే మదపటేనుగు గుర్తొస్తుంది….అతడి పరుగు చూస్తే చిరుత దర్శనమిస్తుంది. అతడి పోరాటం చూస్తే సింహం జ్ఞాపకం వస్తుంది. అతడి వేగం చూస్తే కృష్ణ జింక కనిపిస్తుంది. అతడి గాంభీర్యం చూస్తే పులి స్ఫురిస్తుంది. ఒక్కసారి ఆయన కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తే ఏదో పవర్ మనల్ని పట్టి కుదిపేస్తుంది. అందుకే అతడు పవర్ స్టార్ అయ్యాడు. అండ్ హి హీజ్ ,ది వన్ అండ్ ఓన్లీ అవర్ ఓన్ పవన్ కళ్యాణ్. నేడు అతడి పుట్టినరోజు. ఇది ఫ్యాన్స్ అందరికీ పండుగరోజు.
కొణిదెల కళ్యాణ్ బాబుగా సెప్టెంబర్2, 1971లో జన్మించాడు ఈ మెగాస్టార్ మెస్మరైజింగ్ తమ్ముడు. అఖిలాంద్రదేశానికి చిరంజీవిగా బంధువైన కొణిదెల శివశంకర వర ప్రసాద్ కుటుంబంలో పెద్ద కొడుకుకాగా, ఈ హైలీ టాలెంటెడ్ తమ్ముడు చిన్నోడు. తెలుగువారి ఈ ఇద్దరి హీరోల నడుమ జన్మించారు గట్స్ వున్న నిర్మాత నాగబాబు. అయితే చిన్నవాడుగా, ముద్దుల కొడుకుగా పుట్టిన పవన్ చిన్నప్పట్నుంచి పెద్ద ఇంట్రో వర్ట్.
తన ప్రపంచంలో తాను బతికే ఆలోచనా శీలి. అదే వ్యక్తిత్వం స్టార్ హీరో అయ్యాక కూడా కొనసాగిండం విశేషం.
తన ప్రపంచంలో తాను బతికే ఆలోచనా శీలి. అదే వ్యక్తిత్వం స్టార్ హీరో అయ్యాక కూడా కొనసాగిండం విశేషం.
ఇక తనకే కాక ఆల్ ఆంధ్ర తమ్ముళ్లకు అన్నయ్య అయిన చిరు ఇన్ స్పిరేషన్ తోనే సినీ రంగంలో అడుగుపెట్టాడు. కాని మెగాస్టార్ తమ్ముడన్న నిర్లక్ష్యంతో కాక తెలుగు సినిమాను శాసిస్తున్న అంకుఠిత దీక్షాతత్పరుని నటవారసుడ్నన్న జాగ్రత్తతో, జాగురతతో అతడు ఎంతో సాధన చేసి టాలీవుడ్ కి తాను కనిపించాడు.
ఆ ఫలితమే వెన్నుపూస నిటారుగా నిలిపే స్టన్నింగ్ ఫైట్స్. మళ్లీమళ్లీ చూడాలనిపించే క్రేజీ స్టెప్స్. అత్యంత సహజంగా సాగిపోయే నటన….మొత్తంగా ఓ మాయాజాలం.ఒక ఖుషీ…..అభిమానులకు తన సినిమా అంటే ఒక జల్సా. ఇలా తనదైన ప్రపంచాన్ని, తనదైన మేనియాను సృష్టించాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అందుకే ఈనాడు అతడు మెగాస్టార్ తమ్ముడు కంటే ఎక్కువగా పవర్ స్టార్. ఎనిమిది దశాబ్దాల తెలుగు సినిమా ప్రపంచానికి ఎనిమిదో వండర్. హిట్లు, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా తన ఫ్యాన్స్ హృదయారణ్యాల్లో స్వైర విహారం చేసే ది రాయల్ బెంగాళ్ టైగర్ సిద్దు, సిద్దార్ధ్ రాయ్… ప్రస్తుతం మరోసారి బాక్సాఫీస్ దగ్గర అత్తారింటికీ దారేదీ సినిమాతో దుమ్మురేపడానికి సిద్దమైన పవర్ స్టార్ కి ఇవే మా chitriyala.com జన్మదిన శుబాకాంక్షలు.
0 comments