హైదరాబాద్: నటుడు రాహుల్ రవీంద్రన్(అందాల రాక్షసి ఫేం), సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. గత కొంత కాలంగా వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. త్వరలో పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. ‘ఏ మాయ చేసేవె' చిత్రంలో సమంత వాయిస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తొలి చిత్రంతో సమంతకు అంత పేరు రావడానికి ఆ వాయిస్ కూడా ప్రధాన కారణం. ఈ చిత్రంలో సమంతకు డబ్బింగ్ చెప్పింది మరెవరో కాదు సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి.
ఇక అందాల రాక్షసి చిత్రం ద్వారా తెలుగు హీరోగా పరిచయం అయిన రాహుల్, ఆ తర్వాత పలు చిన్న బడ్జెట్ చిత్రాల్లో నటింస్తున్నాడు. ప్రస్తుతం పెళ్లి పుస్తకం, వనక్కం చెన్నై, నేనేం చిన్న పిల్లనా చిత్రాల్లో నటిస్తున్నాడు. తెలుగులో ప్రవేశించడానికి ముందు రాహుల్ మూడు తమిళ చిత్రాల్లో నటించాడు.
0 comments