హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు శుభ వార్త. ప్రముఖ సోషల్ నెట్వర్కింగు వెబ్‌సైట్ ‘ఫేస్‌బుక్'లో ప్రభాస్ జాయిన్ అయ్యాడు. అక్టోబర్ 18న ఖాతా ఓపెన్ చేసిన ప్రభాస్‌కు ఫాలోయింగ్ అదిరిపోతుంది. కేవలం ఐదు రోజుల్లోనే ఆయన్ను ఫాలోఅయ్యేవారి సంఖ్య 50వేలకు చేరువైంది. పరిస్థితి చూస్తుంటే ప్రభాస్ త్వరలోనే రికార్డు స్థాయి ఫాలోవర్స్‌ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రభాస్‍కు యూత్‌లో ఫాలోయింగ్ ఎక్కువ. అందుకే ఆయనకు ఫేస్‌బుక్ ఫాలోవర్స్ సంఖ్య వేగంగా పెరుగుతుందని స్పష్టం అవుతోంది. ఆయన అఫీషియల్ ఫేస్ బుక్ వెబ్ అడ్రస్ https://www.facebook.com/ActorPrabhas.
ప్రభాస్ ప్రస్తుతం రాజమౌళి దర్శత్వంలో ‘బాహుబలి' చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ‘బాహుబలి' షూటింగ్ మూడో షెడ్యూల్ జరుగుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు రాణా, అనుష్క, రమ్యకృష్ణ ముఖ్య పాత్ర పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. సినిమా కోసం ఫిల్మ్ సిటీలో కోట్లాది రూపాయల ఖర్చుతో భారీ సెట్టింగులు వేసారు. అవార్డ్ విన్నింగ్ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ వాస్తవికత ఉట్టిపడేలా ఈ సెట్ డిజైన్ చేసారు. ఇంకా సత్యరాజ్, నాజర్, అడవి శేషు, సుదీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆర్కా మీడియా బేనర్‌పై శోభు యార్లగడ్డ, కె. రాఘవేంద్రరావు, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో షూట్ చేస్తున్నారు. హిందీ, విదేశీ బాషల్లోనూ విడుదల చేసే అవకాశం ఉంది. దాదాపు రూ. 80 కోట్ల నుంచి రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే ‘ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది.
0 comments