Master blaster Sachin Tendulkar announced his retirement and moments after he walked out of the Wankhede stadium, the Indian government announced Bharat Ratna, country’s highest civilian honor to him along with scientist CVN Rao. This has given rise to a discussion whether Sachin is really eligible for that.
Barring the fact that he has played cricket illustriously what are the other credentials.
Well, inside reports say there is a big game behind all this. Sachin is the brand ambassador for many corporate companies and crores of rupees are staked on his head as part of that. So, it is heard that the corporate companies have brought that pressure on the government.
On the other hand, even Rahul Gandhi kept everything aside and came to watch the match.
Buzz is that Congress giving Bharat Ratna to Sachin is with the motive of using him in the coming years for their benefits. In the last five years, not one name was even identified for this honor. But along with Sachin another scientist getting it is being seen as a gesture to protect themselves from criticism.
సచిన్‌కు భారతరత్నను ‘హోం’ తిరస్కరించిందిట!
సచిన్‌ను మన దేశంలోని అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న కు ఎంపిక చేయాల్సిందిగా తమ వద్దకు విజ్ఞప్తులు వచ్చినప్పుడు కేంద్ర హోంశాఖ కుదరదంటూ తిప్పికొట్టిందిట. అయితే ఇది ఇప్పటి సంగతి కాదు. సచిన్‌కు భారతరత్న ఇవ్వడం గురించి యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ సహాయ మంత్రి అజయ్ మాకెన్ ఈ ఏడాదిసెప్టెంబరులోనే కేంద్ర హోంశాఖ వారికి లేఖ రాశారుట. భారతరత్న అవార్డులకు ప్రముఖులను ఎంపిక చేసే రంగాల్లో క్రీడలను కూడా ఒక విభాగంగా చేర్చవలసిందిగా మాకెన్ ఆ లేఖలో హోంశాఖను కోరారుట. అయితే హోంశాఖ ఆ సలహాను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. భారతరత్నకు ఎంపిక చేసే రంగాల జాబితాలో క్రీడలను జతచేర్చడం అనేది.. ఇతరత్రా వ్యాపార, పారిశ్రామిక, సంఘసేవా రంగాలను కూడా చేర్చాలనే మరిన్ని డిమాండ్లకు ఆస్కారం ఇచ్చే ప్రమాదం ఉన్నదని వారు సమాధానమిచ్చారట.
ఈవిషయాలను స్వయంగా హోంశాఖ ప్రకటించింది. ఓ సమాచార హక్కు కార్యకర్త అడిగిన వివరాలకు స్పందించి ఈ విషయాన్ని హోంశాఖ విడుదల చేసింది. సచిన్ టెండూల్కర్ ఆ పురస్కారానికి అర్హుడే అయినప్పటికీ క్రీడారంగం నుంచి ఇంకా ఎందరో దిగ్గజాలు ఉన్నారని, మన దేశానికి గర్వకారణ చిహ్నాలుగా నిలిచిన ధ్యాన్‌చంద్, జస్పాల్‌రాణా, విశ్వనాధన్ ఆనంద్, పిటి ఉషా వంటి వారు కూడా ఉన్నారని కూడా హోంశాఖ ఆ లేఖలో పేర్కొన్నదిట.
ఇప్పుడు సచిన్‌కు భారతరత్న ప్రకటించిన తర్వాత.. దేశమంతా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నప్పటికీ.. ఇదే క్రీడారంగంలో ఇంతకంటె నిరుపమాన సేవలు అందించిన వారి సేవలు మరుగున పడిపోయినందుకు చింతిస్తున్న వారు అనేకులు ఉన్నారు. ఈ వ్యవహారంలో కోర్టు కేసులు కూడా దాఖలయ్యాయి. ఆ వివాదానికి అనువుగానే హోంశాఖ పాత ఆదేశాలు కూడా ఉన్నట్లు కనిపిస్తున్నాయి.
0 comments