సూపర్ స్టార్ మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘1'(నేనొక్కడినే) చిత్రం ఆడియో ఈ నెల 19న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. మహేష్ బాబుకు ఉండే భారీ ఫ్యాన్ ఫాలోయింగును దృష్టిలో పెట్టుకుని టీవీల్లో లైవ్ టెలికాస్ట్ చేయడంతో పాటు...కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలోకూడా అభిమానుల కోసం లైవ్ టెలికాస్ట్ చేయబోతున్నారు.
అయితే ఆడియో వేడుక హైదరాబాద్‌లోనే జరుగుతున్న నేపథ్యంలో.....హైదరాబాద్ మినహా ఇతర ప్రాంతాల్లో థియేటర్లలో ఈ ఏర్పాట్లు చేసారు. తాజాగా ఆడియో వేడుక కోసం కొన్ని థియేటర్లను ఫైనల్ చేసారు. మరికొన్ని థియేటర్ల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.
విజయవాడ : కళ్యాణ చక్రవర్తి
రాజమండ్రి : కుమారి
వైజాగ్ : వెంకటేశ్వర
కర్నూలు : ఆనంద్
ఖమ్మం : శ్రీనివాస
విజయనగరం : ఎన్సిసి
గాజువాక : మోహిని
కాకినాడ : సంగీత్
భీమవరం : విజయలక్ష్మి
తణుకు : నరేంద్ర
ఏలూరు : మిని నారాయణ
మచిలీపట్నం : రేవతి
హనుమాన్ జంక్షన్ : కె.ఎస్.టాకీస్
గుంటూరు : నాజ్
నెల్లూరు : నర్తకి
తిరుపతి : వేల్ రామ్స్
కడప : అమీర్
అనంతపూర్ : వెంకటేశ్వర
థియేటర్లలో మహేష్ బాబు ‘1' ఆడియో వేడుక చూడాలనుకునే వారు రూ. 250 చెల్లించాలని తెలుస్తోంది. వీరికి టికెట్‌తో పాటు ఉచితంగా టీషర్టు, క్యాప్, క్యాలెంటర్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేసారట. 14 రీల్స్ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కృతి సనన్ హీరోయిన్. సుకుమార్ దర్శకుడు. డిసెంబరులో నిర్మాణానంతర కార్యక్రమాలు ముగించుకొని సంక్రాంతి పండగ నాడు ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

0 comments