మహేష్‌బాబుతో పోకిరి, బిజినెస్‌మేన్‌లాంటి విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన పూరి జగన్నాథ్ త్వరలోనే తమ కాంబినేషన్‌లో మూడో సినిమా తెరకెక్కనుందని చెప్పాడు. ‘హార్ట్ ఎటాక్’ రిలీజ్ వ్యవహారాలతో బిజీగా ఉన్న పూరి జగన్నాథ్ ఆల్రెడీ మహేష్‌కి ఒక లైన్ వినిపించి, అతడినుంచి గ్రీన్ సిగ్నల్ పొందాడట.
‘హార్ట్ ఎటాక్’ చిత్రం రిలీజ్ అయిన తర్వాత, ప్రమోషన్ వ్యవహారాలన్నీ పూర్తయిన తర్వాత పూరి జగన్నాథ్ ఆ కథని విస్తరించే పనిలో బిజీ అవుతాడట. తన తదుపరి చిత్రం మహేష్‌తోనే అంటున్న పూరి జగన్నాథ్ ఇది ఏ సినిమాకీ సీక్వెల్ కాదని స్పష్టం చేసాడు. గతంలో పూరి జగన్నాథ్ బ్యాడ్ ఫామ్‌లో ఉన్నప్పుడే మహేష్‌తో సినిమాలు చేసాడు.
పూరి జగన్నాథ్‌లో స్టఫ్ అయిపోయిందని కామెంట్స్ వచ్చినపుడు మహేష్ సినిమాలతోనే ఆన్సర్ ఇచ్చాడు. పూరి సినిమాలంటే మహేష్‌కి కూడా బాగా గురి. పూరి స్టయిల్ సినిమాలు తనకి బాగా సూట్ అవుతాయని మహేష్ నమ్ముతాడు. కనుక ఈ కాంబినేషన్‌లో మూడో సినిమా త్వరలోనే ఉంటుందని ఫిక్స్ అయిపోవచ్చు. తమ కాంబినేషన్‌లో ఇది హ్యాట్రిక్ హిట్ అవుతుందని పూరి ధీమాగా ఉన్నాడు.
0 comments