Baahubali Movie Review


సినిమా: బాహుబ‌లి
న‌టీన‌టులు: ప‌్ర‌భాస్‌, రానా, అనుష్క‌, త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ‌, నాజ‌ర్‌, స‌త్య‌రాజ్‌, సుదీప్ త‌దిత‌రులు
బ్యాన‌ర్‌: ఆర్కా మీడియా
స‌మ‌ర్ప‌ణ‌: కె.రాఘ‌వేంద్ర‌రావు
సంగీతం: ఎంఎం.కీర‌వాణి
సినిమాటోగ్ర‌ఫీ: ఎస్‌కె.సెంథిల్ కుమార్‌
క‌థ‌: విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌
నిర్మాత‌లు: దేవినేని ప్ర‌సాద్‌, శోభు యార్ల‌గ‌డ్డ‌
ద‌ర్శ‌క‌త్వం: ఎస్ఎస్‌.రాజ‌మౌళి
సెన్సార్ స‌ర్టిఫికేట్‌: యూ/ఏ
రిలీజ్‌డేట్‌: 10 జూలై, 2015


ప్రివ్యూ :
బాహుబ‌లి..ఇప్పుడు ఈ పేరు ఓ జపంలా సౌత్ నుండి నార్త్ వ‌ర‌కు వినిపిస్తుంది. రాజమౌళి తెరకెక్కించిన ఈ బాహుబలి, ఇండియా సిల్వర్ స్క్రీన్ ఫై మునుపెన్నడూ చూడని అధ్బుత పోరాట సన్నివేశాలతో , అవతార్ చిత్ర తరహాలో గ్రాఫిక్స్ తో కూడిన చిత్రంగా రాబోతుంది. ఇప్పుడు ఎక్కడ చూసిన, ఏ టీవీ ఛానెల్ పెట్టినా బాహుబ‌లి గురించే మాట్లాడుతున్నారు..అంతలా ఈ చిత్రంలో ఏముంది అనేది మరో 24 గంటలు అయితే కానీ తెలియదు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 4 వేల థియేటర్స్ ఫై చిలుకున విడుదల కాగా, ఒక్క తెలంగాణా , ఆంధ్ర లలోనే దాదాపు 1400 తెరల ఫై ఈ చిత్రం విడుదల కాబోతుంది..
ఇంతకి ఈ చిత్రంలో హైలైట్స్ ఏంటో చూద్దాం…
ముందుగా చిత్ర నిర్మాతలను అబినందించాలి, ఎందుకంటే ఇంత గొప్ప చిత్రాన్నినిర్మించడానికి ముందుకు వచ్చినందుకు వాళ్ళకు మనం జేజలు కొట్టాలి..దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.
దర్శకుడు రాజమౌళి గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. సినిమా మొదలు పెట్టినప్పటినుండి రేపు రిలీజ్ వ‌ర‌కు కూడా ఎవ్వ‌రి ఊహాల‌కు అంద‌ని స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటూ బాహుబ‌లిచిత్రం తో తెలుగు సినిమా స్థాయిని దేశ‌వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా చెప్పునేవిధంగా మలిచాడు. తాను కన్నా కలలను చిత్రం రూపంలో మలిచి ప్రేక్షకుల కళ్ళ ముందు ఉంచాడు.
ఇక ఈ చిత్రంలోని నటి నటుల గురించి చెప్పుకుంటే ప్రభాస్ రెండు పాత్రలలో కనిపించనున్నాడు. బాహుబలి, శివుడిగా అన్న‌ద‌మ్ములుగా క‌నిపించ‌నున్నారు. బాహుబ‌లిగా ప్ర‌జ‌ల కోసం సుఖ‌శాంతుల‌తో రాజ్యాన్ని పాలించే క్యారెక్ట‌ర్‌లోను..శివుడిగా తండ్రికి జ‌రిగిన అన్యాయంపై ప‌గ తీర్చుకునే పాత్ర‌లోన అద్భుతంగా నటించాడు. బాహుబ‌లి త‌మ్ముడు భ‌ల్లాల‌దేవ‌గా ద‌గ్గుపాటి రానా స్వార్థ‌ప‌రుడైన విల‌న్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రానికి ముందు 82 కేజీల బరువు ఉన్న రానా భ‌ల్లాల‌దేవ‌ పాత్ర కోసం 32 కేజీలు పెరిగాడు . చిత్రం లో ప్రభాస్ కు ఏమాత్రం తగ్గకుండా తన రోల్ నాబోతు..నా భవిష్యత్ అనే రీతిలో నటించాడని వీడియోస్ చూస్తేనే తెలుస్తుంది. శివగామి క్యారెక్ట‌ర్‌లో ర‌మ్య‌కృష్ణ, మరోసారి నరసింహ చిత్రాన్ని గుర్తుచేసుకునే విధంగా నటించిందని టాక్. దేవ‌సేన క్యారెక్ట‌ర్‌లో అనుష్క‌, రాకుమారిగా ప్ర‌భాస్‌ను ప్రేమించే అవంతిక పాత్ర‌లో త‌మ‌న్నా న‌టించారు. సైన్యాధిప‌తి క‌ట్ట‌ప్ప‌గా స‌త్య‌రాజ్‌, స్వార్థ‌ప‌రుడైన మంత్రి బిజ్జ‌ల‌దేవ‌గా నాజ‌ర్ కనిపించనున్నాడు.
ఈ సినిమాకు ప‌ని చేసిన ఆర్ట్ డైరెక్ట‌ర్ సాబు సిరిల్ రెండు సంవ‌త్స‌రాలుగా రామోజీ ఫిలింసిటీలోనే ఉండి ప‌ని చేశాడంటే ఈ సినిమా సెట్టింగులు ఏ స్థాయిలో ఉంటాయో అర్థ‌మ‌వుతోంది. ఈ సెట్ల‌న్ని చూస్తుంటే మ‌నం మ‌రో ప్ర‌పంచంలోకి వెళ్ళబోతున్నాం అనిపించేతంగా సెట్స్ వేసాడు. కోట‌లు, రాజ్యం, ఇలా ఫిలింసిటీలో దాదాపు 110 ఎక‌రాల్లో ఈ సెట్లు వేశారంటే మ‌నం స్ర్కీన్ పై చూడ‌డానికి రెండు క‌ళ్లు చాల‌వేమో అనిపిస్తోంది.
సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేసిన సెంథిల్‌కుమార్, రాజమౌళి కి దగ్గర పోలికలు ఉంటాయి..ఇద్దరు కూడా సినిమాని ప్రేమిస్తారు. యమదొంగా తో స్టార్ట్ అయిన విరి ప్రయాణం బాహుబలి వరకు కూడా సాగుతూనే ఉంది..బాహుబలి విజువ‌ల్స్ ఓ రేంజ్‌లో వ‌చ్చేందుకు ఎంతో శ్ర‌మించిన‌ట్టు మ‌న‌కు ట్రైల‌ర్స్ చూస్తుంటేనే అర్థ‌మ‌వుతోంది. ఈ సినిమాలో కీలక స‌న్నివేశాల‌ను హెలీకాఫ్ట‌ర్ల ద్వారా షూట్ చేసేందుకు సెంథిల్ ఎంతో క‌ష్ట‌ప‌డ్డార‌ని చిత్ర యూనిట్ చెపుతుంది.
దాదాపు ఈ చిత్రానికి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 25 మంది జాతీయ అవార్డ్స్ గ్రహీతలు పనిచేసారు. బాహుబలి చిత్రంలో మరో ప్రధాన ఆకర్షణ భ‌ల్లాల‌దేవ‌ విగ్రహం 200 మంది కార్మికులు దాదాపు నెల రోజుల పాటు పనిచేసి ఈ విగ్రహం నిర్మించారు. 125 అడుగుల ఎత్తు, ఎనిమిది వందల కేజీల బరువుతో కూడిన విగ్రహం, ఈ విగ్రహాన్ని నిలబెట్టుందుకే 4 భారీ క్రేన్స్ వాడారట.
ఇక ఎం.ఎం. కీరవాణి ఈయన స్వరాల గురించి మనం కొత్తగా చెప్పింది ఏముంది..రాజమౌళి కథ తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మ్యూజిక్ గాని అద్బుతం అని చెప్పాలి.. పాటలు మార్కెట్లో విడుదలయిన దగ్గరినుండి ఎక్కడ చూసిన బాహుబలి సాంగ్స్ వినపడుతూనే ఉన్నాయి.
ఎన్నిఅద్బుతాలు కలబోసిన బాహుబలి ఎలా ఉండబోతుంది అనేది రేపటివరకు ఆగితే కానీ తెలియదు..ఈ చిత్రానికి సంబదించిన లైవ్ అప్ డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం మీ పేజి ని రిఫ్రెష్ చేస్తూనే ఉండండి…..



thumbnail
About The Author

Ut dignissim aliquet nibh tristique hendrerit. Donec ullamcorper nulla quis metus vulputate id placerat augue eleifend. Aenean venenatis consectetur orci, sit amet ultricies magna sagittis vel. Nulla non diam nisi, ut ultrices massa. Pellentesque sed nisl metus. Praesent a mi vel ante molestie venenatis.

0 comments