#Jallikattu is the spirit of Tamil Nadu - bold and fearless.
Proud to see such a statement of unity among Tamilians for something that they truly believe in.
Especially admire the way the students of Tamil Nadu have been standing up for the cause, relentlessly fighting for their roots and culture.
Hope their voices are heard. I support the spirit of Tamil Nadu. #JusticeforJallikattu
మహేష్ బాబు చాలా అరుదుగా ట్వీట్స్ పెడుతూ ఉంటాడు. పండుగకు శుభాకాంక్షలు చెప్పడం.. సినిమా సంగతులు ఏవైనా చెప్పేందుకు తప్ప తరచుగా ట్వీట్స్ పెట్టే టైపు కాదు టాలీవుడ్ సూపర్ స్టార్. అది కూడా పొడిపొడిగా రెండు ముక్కలతో సరిపెట్టేసినట్లుగా ఉంటాయి మహేష్ ట్వీట్స్.
కానీ ఇప్పుడు సడెన్ గా జల్లికట్టును సపోర్ట్ చేస్తూ మహేష్ బాబూ సుదీర్ఘమైన ట్వీట్స్ పెట్టాడు. 'తమిళనాడు సంప్రదాయం జల్లికట్టు.. బోల్డ్ అండ్ ఫియర్ లెస్'.. 'తమిళియన్స్ వాళ్లు నమ్మినదానిపై.. అందరూ కలిసి ఐకమత్యంగా ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం చూస్తే గర్వంగా అనిపిస్తోంది'.. 'ప్రత్యేకంగా తమిళనాడు విద్యార్ధులు తమ లక్ష్యం కోసం.. పునాదులు సంస్కృతీ సంప్రదాయాల కోసం పోరాడుతున్న తీరు అభినందనీయం. వాళ్లను చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది.'.. 'వారి గొంతులు అందిరికీ వినిపిస్తాయని ఆశిస్తున్నా. నేను స్పిరిట్ ఆఫ్ తమిళనాడును సపోర్ట్ చేస్తున్నా.. #JusticeforJallikattu' అంటూ ట్వీట్ చేశాడు మహేష్ బాబు.
మొత్తానికి ఇప్పటివరకు తమిళ సెలెబ్స్ మాత్రమే సపోర్టు చేస్తున్న ఈ జల్లికట్టు ఉద్యమానికి ఇప్పుడు తమిళనాట పెరిగిన తెలుగు సూపర్ స్టార్ కూడా సపోర్టు ఇవ్వడం హాట్ టాపిక్ అయిపోయింది.
0 comments