సంచలనం సృష్టించిన సినిమా బాహుబలి సరికొత్త రికార్డును సృష్టించబోతోంది. ఇంతవరకు అమీర్ ఖాన్ నటించిన పికె సినిమా 792 కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డు సృష్టించగా, బాహుబలి-2 ఇప్పటికే 700 కోట్ల రూపాయల వసూళ్లు చేసిందని, త్వరలోనే పికె రికార్డును దాటిపోతుందని సినీ ప్రముఖులు చెబుతున్నారు.సినిమా మొదటి వారాంతానికి 540 కోట్ల రూపాయల ను బాహుబలి వసూలు చేసిందని చెబుతున్నారు.
ఒక్క హిందీలోనే తొలి నాలుగు రోజుల్లో 150 కోట్ల రూపాయలు నెట్ వసూలుచేసి తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ఈ విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్టు తరణ్ ఆదర్శ్ తెలిపారు. రాజమౌళి, బాహుబలి టీమ్ కలిసి భారతీయ సినిమా గర్వంగా నిలిచేలా చేశారంటూ రాజమౌళిని ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. అలాగే, ఒక్క అమెరికాలోనే ఓపెనింగ్ వీకెండ్‌లో ఒక భారతీయ సినిమా రూ. 65.65 కోట్లు సాధించగలదని ఎవరైనా కనీసం ఊహించగలరా అంటూ.. యూఎస్ రికార్డుల గురించి కూడా ఆయన తెలిపారు.
Source:KS
0 comments