చివరి రక్తపు బొట్టు వరకు తాత గారు పెట్టిన పార్టీ ని వీడేది లేదని ప్రగాల్భాలు పలుకుతున్న జూనియర్ ఎన్టీఆర్…ఈ పార్టీలో తనకు సరైన గుర్తింపు ..గౌరవం ఇవ్వడం లేదని..చంద్ర బాబు మీద కసితో .. ఇండైరెక్ట్ గా వైయస్ ఆర్ సిపి కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే..తన మామ గారు నడుపుతున్న ఛానెల్లో.. ఈ మధ్య.. మిగిలిన రాజకీయ పార్టిల విశేషాల కంటే.. జగన్ పార్టీకి సంబంధించిన ప్రతి న్యూస్ ను హైలెట్ చేస్తూ పాజిటివ్ గా ప్రసారం చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది.
ఈ ఛానెల్ వ్యూయర్స్ కు ఆ విషయం ఈ పాటికే అర్దం అయ్యివుంటుంది. కేవలం వ్యక్తి గత కారణాల వలన ..తన తాతగారు పెట్టిన పార్టీ ని కూడా వదులుకోవడానికి సిద్ద పడుతున్నారంటే.. దీని ఎఫెక్ట్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాల పై ఉంటుందనేది పరిశీలకుల టాక్. ఎందుకంటే..పార్టీ అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్ని చూస్తాంటారు మరి. ఈ లోకంలో ఎవరి స్వార్దం వారిదే..ఎవరు..తమ స్వార్దం లేకుండా ఏది చేయరు ..అందుకే జూనియర్ వై యస్ ఆర్ సిపికి మద్దతు ఇవ్వడం ఒక ఎగ్జాంపుల్ అంటున్నారు క్రిటిక్స్. అయితే ఎన్టీఆర్ సన్నిహితులు మాత్రం యంగ్ టైగర్ ప్రాణం ఉన్నంత వరకు టీడిపి కోసమే అంటున్నారు ..ఏది నమ్మాలో మరి!.
0 comments