ఫగ్వారా: పెళ్లి కోసం బ్యాండ్, బాజాతో దర్జాగా వచ్చిన ఓ వరుడి బృందానికి పెళ్లి మండపం దగ్గర వధువు, ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరు కనిపించక పోవడంతో వెనుదిరిగి పోయిన సంఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పంజాబ్‌లోని ఫగ్వారా సమీపంలోని గోవిందపురానికి చెందిన పరంజిత్ రాంకు ఫేస్‌బుక్ ద్వారా ఒకమ్మాయితో స్నేహం కుదిరింది.
అది కొన్నాళ్లకు ప్రేమగా మారింది. పెళ్లి చేసుకునేందుకు పరంజిత్ రాం గ్రీస్ నుంచి తిరిగి వచ్చాడు. అమ్మాయి వాళ్ల ఇంటికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు. అందరు పెళ్లికి అంగీకరించారు. దీంతో ఈ నెల 11వ తేదిన ముహూర్తం కుదిరింది. పెళ్లికి అంతా సిద్ధం చేసుకున్నారు. పెళ్లి శుభలేఖలు అందరికీ పంచారు.
పెళ్లి రోజు వరుడు ఆర్భాటంగా పెళ్లి మండపం వద్దకు వచ్చాడు. కానీ, ఫంక్షన్ హాలు వద్ద చూస్తే ఎవరు లేరు. ఆ హాలును బుక్ చేసిన దాఖలాలు కూడా లేవు. విషయం తెలుసుకునేందుకు వరుడి బంధువులు వధువు ఇంటికి వెళ్లారు. అక్కడ వధువు, కుటుంబం జాడ లేదు. బిత్తరపోయిన వారు వధువు, ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్లు చేశారు. అన్ని ఫోన్లు స్విచ్ఛాఫ్. దీంతో వరుడి కుటుంబ సభ్యులు పోలీసులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
0 comments