హైదరాబాద్: అక్కినేని యువ హీరో నాగ చైతన్య ప్రేమలో పడ్డాడు. ఇదేదో సినిమా విషయం అనుకుంటే పొరపాటే. మేము చెబుతుంది రియల్ లైఫ్ విషయమే. ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ నాగ చైతన్య ఈ విషయాన్ని వెల్లడించారు. తాను ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డానని, ఆమె ఎవరనే విషయం చెప్పడం నాకు ఇష్టం లేదు' అని వెల్లడించారు. ఆమె హైదరాబాద్‌కి చెందిన వ్యక్తా? చెన్నయ్‌కి చెందిన వ్యక్తా? అనే ప్రశ్నకు కూడా నాగ చైతన్య సమాధానం చెప్పడానికి నిరాకరించాడు. ఏది ఏమైతేనేం.....ఇన్నాళ్లు బుద్దిగా ఉన్న నాగ చైతన్య ఉన్నట్టుండి ప్రేమలో పడటం ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశం అయింది.
అయితే కొందరు నాగ చైతన్య వ్యవహారంపై అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నాడు. ప్రేమ పేరు చెప్పి పబ్లిసిటీ గిమ్మిక్కులు ప్లే చేస్తున్నాడేమో అని సందేహిస్తున్నారు. కెరీర్లో మూడు హిట్లు కొట్టినా....నాగ చైతన్య ఇండస్ట్రీలో పెద్దగా పేరు లేదనే చెప్పాలి. ఒక్క హిట్టూలేని రాణా తరచూ ఎఫైర్లకు సంబంధించిన విషయాలతో వార్తల్లోకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరి ప్రేమలో ఉన్నానని చెబుతున్న నాగ చైతన్య మాటల్లో నిజం ఎంత అనేది త్వరలోనే తేలనుంది. ఆ విషయాలు పక్కన పెడితే....ప్రస్తుతం నాగ చైతన్య రెండు చిత్రాలు చేస్తున్నారు. దేవా కట్ట దర్శకత్వంలో ‘ఆటో నగర్ సూర్య' సినిమాతో పాటు, అక్కినేని మూడు తరాల హీరోలు కలిసి నటిస్తున్న ‘మనం' చితం చేస్తున్నాడు. మనం చిత్రానికి విక్రమ్ కుమార్ దర్శకత్వం. ఈ రెండు చిత్రాల్లోనూ నాగ చైతన్య సరసన సమంత హీరోయిన్.
0 comments