హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘1'(నేనొక్కడినే) చిత్రం విడుదలకు ముందే మంచి బిజినెస్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం వైజాగ్ ఏరియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ రూ. 5 కోట్లు అమ్ముడయినట్లు తెలుస్తోంది. ‘గాయిత్రి ఫిలిమ్స్' పంపిణీ సంస్ధ ఎన్ఆర్ఏ పద్దతిలో ఈచిత్రం రైట్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. చిత్రం ఘన విజయం సాధిస్తుందని,మంచి లాభాలు వస్తాయని టాక్ ట్రేడ్ లో స్ప్రెడ్ అవటంతో విపరీతమైన పోటీ ఏర్పడిందని చెప్తున్నారు.
అలాగే ఇప్పటికే గుంటూరు ఏరియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ రూ. 4 కోట్లు అమ్ముడయినట్లు తెలుస్తోంది. ‘ఎస్ క్రియేషన్స్' అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఎన్ఆర్ఏ పద్దతిలో ఈచిత్రం రైట్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ ఈ సినిమాతో తెరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రను గౌతమ్ పోషిస్తున్నాడు.
డిఫరెంట్ చిత్రాలకు పెట్టింది పేరైన దర్శకుడు సుకుమార్....చాలా కాలం పాటు స్క్రిప్టు వర్కు చేసి వైవిధ్యమైన అంశాలతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. వినోదంతో పాటు అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈచిత్రం ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు రాక్ స్టార్‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది. మహేష్ సరసన కృతి షానన్ నటిస్తోంది. సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంలో ఆచంట రామ్, ఆచంట గోపీచంద్, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.
0 comments