ఎవడు వాయిదా పడుతుందా? ఈసారి కూడా రాదా..? ఏకంగా సంక్రాంతికే చూపిస్తారా? మెగా ఫ్యాన్స్‌లో రేగుతున్న ప్రశ్నలు ఇవి. ఇంత భారీ చిత్రాన్ని సంక్రాంతికి తీసుకొస్తే బాగుంటుందని, పండగ మూడ్‌లో ఈసినిమాకి కావల్సినన్ని వసూళ్లు వస్తాయని దిల్‌రాజు భావిస్తున్నట్టు చెప్పుకొన్నారు. అయితే ఈ సినిమా డిసెంబరు 19న రావడం ఖాయమట. ఈసారి తేదీ మార్చేది లేదని... దిల్ రాజు చెబుతున్నారు.
దానికీ ఓ కారణం ఉంది. ఈ పండక్కి సినిమాల సందడి పెద్ద ఎత్తున ఉండబోతోంది. వన్, రేసుగుర్రం, రేయ్, హార్ట్ ఎటాక్ బెర్తులు సిద్ధం చేసుకొంటున్నాయి. ఇన్ని సినిమాలున్నప్పుడు యావరేజ్‌లు నిలబడవు.. అందుకే అంత రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక ఎవడుని డిసెంబరులోనే తీసుకొచ్చేయాలని దిల్ రాజు డిసైడయ్యారు.
డిసెంబరులో పెద్ద సినిమాల హడావుడి ఉండదేమో అనుకొంటున్న తరుణంలో సినీ ప్రియులకు, ముఖ్యంగా మెగా అభిమానులకు ఇది తీపి కబురే..!
0 comments