స్టార్ హీరో అన్నాక, అతను నటించిన సినిమా ఆలస్యమైతే.. అది ఖచ్చితంగా ఆ హీరో ఇమేజ్‌పై పడ్తుంది. నిర్మాణంలో ఆలస్యమయినా ఫర్వాలేదుగానీ, సినిమా రిలీజ్‌కి సిద్ధమైపోయి.. రేపో మాపో విడుదలవ్వాల్సిన సినిమా అనివార్య కారణాల వల్ల ఆగిపోయి, కొద్ది రోజుల్లో విడుదలవ్వాల్సింది.. నెలల తరబడి ఆగిపోతే మాత్రం, ఆ సినిమా ఇంపాక్ట్ ఆ హీరో కెరీర్‌పై బాగానే పడ్తుంది.
రామ్‌చరణ్ పరిస్థితి ఇప్పుడిదే. చరణ్ ఇప్పుడేం చేస్తున్నాడు.? అంటే చెప్పుకోడానికేమీ లేదు. ‘తుఫాన్’ దెబ్బ కొట్టడంతో, ఆ వెంటనే ‘ఎవడు’ విడుదలైపోయి వుంటే, ఆ సినిమా ఫలితమెలా వున్నా, చరణ్ యాక్టివ్‌గా వున్నాడనే అభిప్రాయం అందరిలోనూ కలిగేది. చరణ్ ` కృష్ణవంశీ డైరెక్షన్‌లో ఓ సినిమాకి కమిట్ అయ్యాడన్న వార్తలు కొంతమేర అభిమానుల్ని సంతోషపెట్టగలవేమోగానీ, ‘ఎవడు’ డిలేని మాత్రం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.
‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాని విడుదల చేసిన ‘దిల్’ రాజు, ‘ఎవడు’ని అటకెక్కించేయడం పలు అనుమానాలకు తావిచ్చింది గతంలోనే. ‘అత్తారింటికి దారేది’ సినిమాపైకి ‘ఎవడు’ను పోటీకి దింపేద్దామనుకున్న దిల్ రాజు, సమైక్య ఉద్యమం కారణంగా ‘ఎవడు’ని వెనక్కి నెట్టేసిన విషయం విదితమే.
అప్పటినుంచీ ఇప్పటిదాకా ‘ఎవడు’ రిలీజ్‌కి అడ్డంకులు తొలగడంలేదు. వాస్తవానికి అడ్డంకులేమీ లేవు, దిల్ రాజు అనుకోవడమే మిగిలి వుంది. డిసెంబర్‌లో ‘ఎవడు’ రిలీజ్ అవుతుందని అందరూ అంటున్నా, అది కాస్తా సంక్రాంతికి వెళ్ళిపోతుందన్న వార్తలు అభిమానులకు ఆందోళన కలిగిస్తున్నాయి.
0 comments