ఇదేంటి కోలీవుడ్ హీరోలు మన ..టాలీవుడ్ హీరోతో పోటి ఏంటి…? అసలు సమస్య ఏంటి అనుకుంటున్నారా..? ఉంది. వచ్చేది పెద్ద పండగా. అటు తమిళియన్స్ కు.. ఇటు తెలుగు వారికి బాగా ఇష్టమైన పండగ. ఈ సందర్భంగా విజయ్, అజిత్ లు జిల్లా, వీరమ్ అనే చిత్రాలతో అభిమానుల్నిఖుషి చేయడానికి సిద్ద పడుతున్నారు. కట్ చేస్తే.. ఈ రెండు సినిమాలకు మన టాలీవుడ్ సూపర్ స్టార్ వన్ సినిమా ఝలక్ ఇస్తుంది.
కోలీవుడ్ లోనే కాకుండా..కర్ణాటకలో కూడా..మహేష్ సినిమాకే ఎక్కువ రేటు చెల్లించి కొనడానికి బయర్లు ఆసక్తి చూపిస్తున్నారట. విజయ్ , అజిత్ ల చిత్రాలన్ని చాలా తక్కువ ధరకు అడుగుతున్నారట. వన్ సినిమా మేనియా ఏ రేంజ్ లో సౌత్ లో ఉందో చూడండి. సంక్రాంతికి అంటే జనవరి 10న ఈ చిత్రం సౌత్ అంతా విడుదల అవుతుంది. తమిళ్ నాడు లో కూడా ఎక్కువ ధియేటర్స్ లో వన్ చిత్రం విడుదల చేస్తుండటంతో..అక్కడ విజయ్, అజిత్ ల చిత్రాలకు ధియెటర్ల సమస్య కూడా ఎదరువుతుందని టాక్. మొత్తం మీద మన సూపర్ స్టార్ .. ఈ సారి తమిళ స్టార్ హీరోల్ని బాక్సాఫీస్ దగ్గర చాలా గట్టిగా ఢీ కొడుతున్నాడన్నమాట.!
0 comments