సినిమా పాటల్ని రాజకీయాలకు తగ్గట్టుగా అన్వయించేస్తుంటారు కొందరు ఔత్సాహికులు. తమ రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించడానికి, తమ రాజకీయ పార్టీకి క్రెడిట్ పెంచడానికీ రాజకీయ నాయకులు, ఆయా పార్టీలకు చెందిన సానుభూతి పరులు సినిమా పాటల్ని వాడుకోవడం కొత్తేమీ కాదు.
తాజాగా ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీపై ఓ పాట రూపొందించారు కొందరు ఔత్సాహికులు. వీరంతా పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలట. సోనియాపై టీడీపీ నేతల పాట ఏంటో తెలుసా.? ఇటీవలే విడుదలైన మహేష్ ‘1’ సినిమాలోని ‘హూ ఆర్ యూ..’ అంటూ సాగే పాటకి రీమిక్స్.
ఇటలీ నుంచి వచ్చి, దేశ రాజకీయాల్ని శాసిస్తుండడం, రాష్ట్రాన్ని విభజించేందుకు ఆమె ప్రయత్నిస్తుండడం.. వంటి అంశాలన్నీ ‘హూ ఆర్ యూ..’ పాట రీమిక్స్‌లో పొందు పరిచారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. ఇంకేం.. ఇంటర్నెట్లో ఈ పాటకి లైకులే లైకులు. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడాల్లేకుండా ఈ పాటని అంతా ఎంజాయ్ చేస్తుండడం విశేషం.
0 comments