హైదరాబాద్: సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మహేష్ బాబుతో కలిసి మొదటిసారి పనిచేశాడు. ప్రిన్స్ మహేష్ బాబు '1 నెనొక్కడినే' సినిమాకు ఆయన సంగీతాన్ని అందించారు. క్యాచీ ట్యూన్స్‌తో అదరగొట్టే దేవిశ్రీ ప్రసాద్ తెలుగు సినిమాకు ఇటీవలి కాలంలో చాలా హిట్స్ అందించాడు. మహేష్ బాబు 1 నేనొక్కడినే ఆడియో ఇటీవలే విడుదలై యువతను ఊపేస్తోంది. వూ ఆర్ యూ అనే పాటతో ఆల్బమ్ ఓపెన్ అవుతుంది. దీన్ని స్వయంగా డిఎస్పీ పాడాడు. బ్రీజీ రాక్ నెంబర్ అయిన ఈ పాట అన్ని వర్గాలవారిని ఆకట్టుకుంటోంది. పాట చివరి వరకు ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా ఉంది.
పియూష్ కపూర్ పాడిన యూ ఆర్ మై లవ్ పాట పూర్తిగా పాశ్చాత్య బాణీలో కూర్చాడు. యువతకు గురి పెట్టి ఈ పాటను డిఎస్పీ కంపోజ్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ పాట ప్రారంభమై, ముగిసే వరకు ప్రేక్షకులు పూర్తిగా లీనమై పాదాలను లయబద్దంగా ఆడిస్తూనే ఉంటారని చెప్పడంలో సందేహం లేదు. ఓ సాయొనారా పాటను ఎనర్జిటిక్ నెంబర్‌గా అనిపిస్తుంది. అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న ఐటం సాంగ్ లండన్ బాబు రూపంలో వస్తుంది. ప్రియా దానికి తగిన విగర్ను, ఎనర్జీని తెచ్చిపెట్టారు. ఇది చార్ట్‌బస్టర్‌గా మిగిలిపోతుందని అంచనా వేస్తున్నారు.

0 comments