రామ్‌చరణ్ అభిమానులకు శుభవార్త! ఎవడు సినిమా ఓపెనింగ్ సీన్స్ అదిరిపోయాయట. మరీ ముఖ్యంగా మొదటి 20 నిమిషాల ఎపిసోడ్ కెవ్వు కేక అని లాబ్ రిపోర్ట్ ద్వారా తెలిసిన సమాచారమ్.
ఈ 20 నిమిషాల్లో పది నిమిషాలు బన్నీ కనిపిస్తాడట. బన్నీ కనిపించినంత సేపూ ఈ సినిమా సూపర్బ్ (మిగిలిన రెండు గంటల మాట అడక్కండి) అని లాబ్ రిపోర్ట్. ఎవడు ఓపెనింగ్ సీక్వెన్స్ హలీవుడ్ తరహాలో సాగాయని, ఈ విషయంలో వంశీపైడిపల్లి టేకింగ్‌కి పూర్తి మార్కులు పడతాయని తెలిసింది.
సినిమాకి తొలి 20 నిమిషాలే కీలకం కూడా. మిగతా పార్ట్ అంతా రొటీన్ ఫార్ములాలోనే సాగుతుందట. జనవరి 1న టీజర్, 3న ట్రైలర్ విడుదల చేయనున్నారు. వీటిలో చరణ్ చేత అదిరిపోయే డైలాగులు చెప్పించారట. మొత్తానికి ఎవడు ప్రచారం ఊపందుకొంది.
0 comments