తెలంగాణలో కొత్త ట్రాఫిక్ రూల్స్ ను అమలు చేయబోతున్నారు. ట్రాఫిక్ నేరాలకు పాల్పడేవారికి పాయింట్లు కేటాయిస్తారు. దానికి అనుగుణంగా పన్నెండు పాయింట్లు వచ్చేంతవరకు లైసెన్సు రద్దు చేయరు.పన్నెండు పాయింట్లు చేరగానే లైసెన్స్ రద్దు చేస్తారు.
పెనాల్టీలతోపాటు ఆ నేరాన్ని బట్టి పాయింట్లు కేటాయిస్తారు. వాటి సంఖ్య 12కు చేరితే లైసెన్సు రద్దవుతుంది. అదే లెర్నింగ్ లెసెన్సు ఉన్నవారికి ఆ పాయింట్ల సంఖ్యను ఐదుకు పరిమితం చేశారు. అంతకుమించితే వారి తాత్కాలిక లైసెన్సు కూడా రద్దు చేస్తారు.కేవలం జరిమానాలతో ట్రాపిక్ కేసుల నుంచి బయటపడడానికి ఇది అవకాశం ఇవ్వదు.అమెరికా, బ్రిటన్ లలో ఈ తరహా విధానం అమలులో ఉంది.సిసి కెమేరాల ఆధారంగా నేర నిర్దారణ చేస్తారు.ఇరవై నాలుగు నెలల సమయాన్ని గడువుగా చేసుకుని ఈ పాయింట్ల సంఖ్యను బేరీజు వేస్తారు. 24 నెలల కాలంలో పాయింట్ల సంఖ్య 12కు చేరితే ఏడాది పాటు లైసెన్సు రద్దు చేస్తారు. మళ్లీ కొత్త ఖాతా మొదలవుతుంది. మళ్లీ 24 నెలల్లో 12 పాయింట్లు వస్తే రెండేళ్లపాటు తదుపరి పునరావృతమైతే మూడేళ్లపాటు లైసెన్సును రద్దు చేస్తారు.
ట్రాఫిక్ నేరాలకు ఇలా పాయింట్లు కేటాయించారు...
ఆటోలో డ్రైవర్ సీటులో అదనంగా ప్రయాణికులను ఎక్కించుకుంటే 1 మైనస్ పాయింట్
సరుకు రవాణా వాహనాల్లో ప్రయాణికులను ఎక్కించుకుంటే 2 మైనస్ పాయింట్లు
హెల్మెట్, సీటు బెల్టు ధరించకుండా వాహనాలు నడిపితే 1
రాంగ్ రూట్‌లో వాహనం నడిపితే.. 2
నిర్దేశిత వేగాన్ని మించి గంటకు 40 కి.మీ. లోపు వేగంతో వెళ్తే 2
నిర్దేశిత వేగాన్ని మించి గంటకు 40 కి.మీ కన్నా ఎక్కువ వేగంతో వెళ్తే 3
ప్రమాదకరంగా వాహనం నడపడం/సెల్ మాట్లాడుతూ నడపడం/సిగ్నల్ జంపింగ్ 2
మద్యం తాగి బైక్ నడిపితే, రేసింగ్స్, మితిమీరిన వేగంతో దూసుకుపోతే.. 3
మద్యం తాగి ఫోర్ వీలర్, లారీ, సరుకు రవాణా వాహనం తాగి నడిపితే 4
మద్యం తాగి ప్రయాణికులుండే బస్సులు, క్యాబ్, ఆటోలను తాగినడిపితే 5 మైనస్ పాయింట్లు
ఇబ్బంది కలిగేలా నడిపితే/శబ్ద, వాయు కాలుష్యానికి కారణమైనా/అనుమతిలేని చోట పార్క్ చేసినా.. 2
బీమా పత్రం లేకుండా వాహనాలు నడిపితే 2
అనుమతి పత్రం లేకుండా ప్రమాదకర వస్తువులు తరలిస్తే 2
ర్యాష్ డ్రైవింగ్/ఎదుటివారి భద్రతకు ప్రమాదం వాటిల్లేలా/గాయపరిచేలా నడిపితే 2
నిర్లక్ష్యంగా నడిపి ఎదుటివారి మృతికి కారణమైతే.. 5
వాహనం నడుపుతూ చైన్ స్నాచింగ్, దోపిడీ.. తదితర నేరాలకు పాల్పడితే 5
Source: KSR
0 comments