బాహుబలి 2 అడ్వాన్సు బుకింగ్స్ జోరు మీద ఉన్నాయి. మొదటి మూడు టికెట్ జాడ కనిపించడం లేదు. ఆల్మోస్ట్ ఆన్ లైన్ లో ఉంచిన టికెట్స్ అన్ని హాట్ కేక్స్ లాగా గంటల్లోనే అమ్ముడుపోయాయి. సినిమాని ఎలాగైనా మొదటి రోజే చూడలన్న ఆత్రం ప్రభాస్ ఫాన్స్ కంటే మిగిలిన వాళ్ళకే ఎక్కువగా ఉన్నట్టు కనపడుతోంది. ఈ సినిమా ఆడుతున్న సినిమా హాల్స్ దగ్గర తప్ప మిగిలిన చోటల్లా కర్ఫ్యూ వాతావరణమే కనిపించేలా ఉంది. బ్లాకు మార్కెట్ తలుపులు కూడా తెరుచుకున్నాయి. బెనిఫిట్ షో టికెట్ ధర ఆకాశాన్ని అంటుతోంది. అయినా డోంట్ కేర్ అంటున్నారు ఆడియన్స్.
తెలంగాణా లో మాత్రం బెనిఫిట్ షో కు బేషరతుగా అనుమతి నిరాకరించారు. ఉదయం 7 తర్వాత షో వేసుకోవడానికి అనుమతి నివ్వడంతో ఇక విధి లేని పరిస్థితుల్లో మిడ్ నైట్ షో క్యాన్సిల్ చేసుకున్నాయి థియేటర్ యాజమాన్యాలు. ఇది ప్రభాస్ ఫాన్స్ కి నిరాశ కలిగించే వార్త అయినప్పటికీ టాక్ తెల్లవారకుండానే స్ప్రెడ్ కాకుండా చాలా హెల్ప్ అవుతుంది. పైగా టికెట్ రేట్ అధిక ధరకు కౌంటర్ లో అమ్మడానికి కూడా నిరాకరించింది తెలంగాణా ప్రభుత్వం.
కాని ఆంధ్రలో మాత్రం సీన్ రివర్స్ లో ఉంది. అర్ధ రాత్రి నుంచే షో లు వేసి జాతర చేయడానికి ఇక్కడ ఎలాంటి అడ్డంకులు ఉండబోవట్లేదు. ఏకంగా రోజుకు ఆరు షోలు వేసుకోవడానికి అనుమతి ఇవ్వడమే కాక సింగల్ స్క్రీన్స్ లో సైతం టికెట్ ధర 200 దాక అమ్ముకోవడానికి పర్మిషన్ ఇవ్వడంతో దందా భారీ ఎత్తున జరుగుతోంది. బ్లాక్ మార్కెట్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఆరు షోల వరకు అనుమతి ఇవ్వడం వరకు బాగానే ఉంది కాని టికెట్ ధర మూడింతలు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వడం పట్ల మాత్రం నిరసన వ్యక్తం అవుతోంది. బాహుబలి 2 తీసింది హైదరాబాద్ లో, అందులో నటించిన నటీనటులు, పని చేసిన టెక్నీషియన్స్ ఉండేది హైదరాబాద్ లో. కాని ప్రత్యేక వెసులుబాటు ఇస్తోంది మాత్రం ఆంధ్ర ప్రభుత్వం.
కాటమ రాయుడు విషయంలో పట్టుబట్టి మరీ బెనిఫిట్ షో వేయకుండా ఆంక్షలు విధించిన యంత్రాంగం ఇప్పుడు బాహుబలి 2 విషయంలో ఇంత ఉదారంగా ఉంది ప్రేక్షకుల జేబులు కత్తెర వేయడానికి ముఖ్య కారణం ఎపి ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరిస్తున్న సినిమా సమర్పకుడు రాఘవేంద్ర రావు, పంపిణి హక్కులు పొందిన సాయి కొర్రపాటి తదితరులు తమకు ఉన్న పలుకుబడి ఉపయోగించడంవల్లే అని ఫిలిం నగర్ టాక్. మరి ఈ పప్పులు కెసిఆర్ దగ్గర మాత్రం ఉడకలేదు. ఇప్పుడు హైదరాబాద్ సింగల్ స్క్రీన్ లో బాహుబలి మొదటి రోజు టికెట్ ధర 70 నుంచి 100 లోపు ఉండగా అదే గుంటూరు లోని సింగల్ స్క్రీన్ లో మాత్రం 150 మొదలు కొని 200 దాకా ఉంది. అందుకే అన్నది ఆంద్ర ప్రేక్షకులు చేసిన పాపం ఏమిటి అని. కాదంటారా.
Source: vankaya
0 comments