పవన్‌కళ్యాణ్ కాదనడం వల్ల మహేష్‌బాబుకి ‘అతడు’ చిత్రం చేసే అవకాశం వచ్చిందని, అతడికి అది ఒక క్లాసిక్ సినిమాగా నిలిచిపోయిందని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. అతడు కథ త్రివిక్రమ్ తనకి చెప్పినప్పుడు నిద్రపోయానని పవన్ చెప్పాడు. అది మహేష్‌తో తీశానని త్రివిక్రమ్ తెలిపాడు. దీంతో అతడు పవన్ మిస్ అయ్యాడని ఫాన్స్ బాధ పడిపోతున్నారు.
అయితే ‘అతడు’ చిత్రంలో మహేష్ చేసిన క్యారెక్టర్ పవన్ చేసి ఉంటే ఖచ్చితంగా ఫ్లాప్ అయి ఉండేది. పవన్ ఎప్పుడూ ఎనర్జీ నిండిన పాత్రల్లోనే రాణించాడు. అతను అండర్‌ప్లే చేద్దామని చూస్తే పంజాలాంటి చిత్రాలు వచ్చాయి. పవన్‌ని లైవ్ వైర్‌లా చూడ్డానికి ఇష్టపడతారు కానీ సైలెంట్‌గా ఉండే పార్థులాంటి పాత్రల్లో చూడలేరు.
పవన్ నిద్ర పోవడం వల్ల మహేష్‌కి అతడు రావడం కాదు... నిద్రపోయి తనకి ఫ్లాప్ రాకుండా పవన్ తనని తాను కాపాడుకున్నాడు. అలాగే తర్వాత త్రివిక్రమ్‌తో జల్సా, అత్తారింటికి దారేది చేశాడు. ఫస్ట్ ఎటెంప్ట్‌లోనే వీరిద్దరూ ఫ్లాప్ అయినట్టయితే ఆ కథే వేరేలా ఉండేదేమో కదా?
0 comments