'1'లో మహేష్‌బాబు పాత్ర ఏమిటి?? తెరపై అతను ఎలా కనిపించబోతున్నాడు?? ప్రిన్స్ అభిమానులు ఇప్పుడు ఆసక్తిగా చర్చించుకొంటున్న విషయం ఇది.
సుకుమార్ సినిమాల్లో హీరో పాత్ర చాలా టిపికల్ గా ఉంటుంది. హీరో అతనే, ఆఖరికి విలనూ అతనే. '1' కూడా ఈ పడికట్టు సూత్రాలతోనే సాగే యాక్షన్ థ్రిల్లర్. ఈ సినిమాలో హాలీవుడ్ చిత్రం 'ద గాళ్ విత్ డ్రాగన్ టాట్టూ' ఛాయలు కనిపిస్తాయని సమాచారమ్. డిటెక్టివ్ ఏజెన్సీ చుట్టూ తిరిగే కథ ఇది.
ఈసినిమాలో మహేష్ డిటెక్టివ్ పాత్రలో కనిపిస్తాడని చెప్పుకొంటున్నారు. ఆద్యంతం మహేష్ ఇందులో సీరియస్ లుక్‌లోనే కనిపిస్తాడట. మహేష్ అంటే కాస్త వినోదం కూడా అనుకొనే ఫ్యాన్స్ ఈ విషయాన్ని ఎలా రిసీవ్ చేసుకొంటారో మరి..?!
0 comments