జేడీ లక్ష్మీనారాయణ సమర్పించిన ఆధారాలన్నీ ఆ రెండు పేపర్లలో వచ్చిన ఆర్టికల్సే. అవి చూసి కోర్టు, సాక్ష్యాలు తెమ్మంటే వెర్రి మొహం వేసుకొని, " దర్యాప్తు కీలక దశలో ఉంది, బెయిల్ ఇవ్వొద్దు" అని 16 నెలలు చెప్పారు. సుప్రీంకోర్టు చీవాట్లు పెడితే సాక్ష్యాలు ఇంకా లేవన్నారు. జైలు కి పంపినపుడు ఉన్న స్పీడు, సాక్ష్యాలు తేవడానికి ఏమి అయ్యింది. 2౦12 ఉప ఎన్నికల ముందు అరెస్టు చేస్తే, జగన్ ఓడిపోతాడని అనుకొన్న కాంగ్రెస్, ఆ ఎన్నికలలో బొక్క బోర్లా పడింది. జైలులో ఉంచి నయానో భయాన్నో దారికి తేవాలనుకొన్నా జరగలేదు. రేపు బెయిల్ పై విచారణ అంటే బాబుగారు ఎందుకో ఢిల్లీ వెళ్ళేవారు. ఎవరినో కలిసేవారు. బెయిల్ వచ్చేది కాదు.
ఆఖరికి సుప్రీంకోర్టు సాక్ష్యాలు చూపకుండా 9౦ రోజులు దాటితే బెయిల్ ఇవ్వాలని మందలించి, బెయిల్ మంజూరు చేయించింది. న్యాయవ్యవస్థ ను మేనేజ్ చేసేవాడైతే అరెస్టు కాకుండా స్టే తెచ్చుకొని , 2౦14 లోనే ముఖ్యమంత్రి అయిఉండేవాడు. కాళ్ళు పట్టుకొనేవాడైతే కోర్టు లో శంకర్ రావు తో కేసు వేయించినపుడే పట్టుకొనేవాడు. కాంగ్రెస్ తో కుమ్మక్కు అయ్యేవాడైతే కిరణ్ సర్కార్ పై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టిఉండేవాడు కాదు. అప్పుడు కిరణ్ సర్కార్ ని కాపాడింది ఎవరో అందరికీ తెలుసు. అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి ఉంటే, ఎన్నికలు జరిగి ఉండేవి. తెలంగాణ ఊసు ఉండేది కాదు.
ఈ ఆటలో జేడీ ఒక పావు మాత్రమే. కేసు క్విడ్ ప్రో కో అయితే, దానికి సంబంధం లేనివి కూడా కలిపేసారు.
అధికార్లను, మరికొంతమంది ని అరెస్టు చేసి అప్రూవర్ గా మార్చాలని చూసారు. కానీ ఎవరూ ఉపయోగ పడలేదు. అందుకే అవన్నీ వీగిపోతున్నాయి. ఆరు ఏళ్ళు అయినా సాక్ష్యాలు దొరకలేదు. కేసు ప్రూవ్ అయ్యి జైలు కి వెళ్ళలేదు. బయట ఉంచితే సాక్ష్యాలు తారుమారు చేస్తారు అని చెప్తూ జైలు లో పెట్టి, బెయిల్ రాకుండా చేసారు. ఇవన్నీ చాలామందికి తెలిసినవే. కానీ వారు నిజాన్ని అంగీకరించలేరు. జగన్ జైలులో చిప్పకూడు ఎందుకు తిన్నాడు? అని కావాలనే అడుగుతూ ఉంటారు. అదో శాడిజం.
సోర్స్: వీ ఆర్ రాఘవన్
0 comments