2014లో బాబు గారు ముఖ్య మంత్రి అయ్యారు కదా ఆయన ఏం చేశాడో చూద్దాం.... రాజధాని లేదు అని చెప్పి మీరు తెగ ఇదై పోతున్నారు. కానీ 2024 వరకు మనకు హైదరాబాద్ రాజధానిలో హక్కుంది. 2024 వరకు హైదరాబాదులో మనం వాడుకోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు లో అడ్డంగా దొరికి అర్ధరాత్రి పారిపోయారు. ఈ పారిపోటానికి వారు చెప్పిన పేరు రాజధాని లేకుండా కట్టుబట్టలతో గెంటేశారు అని చెప్పారు.
రాజధాని కడుతున్నాము అంటున్నారు, గజానికి 10 వేల పైనే ఖర్చు పెట్టి కొన్ని బిల్డింగ్స్ ఏవో కట్టారు. తీరా బిల్డింగులు కారుతున్నాయి, అది ఏంటి ఏంటి వాళ్ళు పైపు కోశారు అని కాకమ్మ కబుర్లు చెబుతారు. ఒకప్పుడు పోలవరం మీద కేసు వేసింది తెలుగుదేశం పార్టీ వాళ్లే... నామా నాగేశ్వరరావు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సమయంలో పోలవరం ప్రాజెక్టు మీద కేసు వేస్తే తెచ్చుకొని మూడేళ్లు ఆపేశారు. ఈ విషయం మీకు తెలుసా? కానీ ఈరోజు పరిగెత్తుకుంటూ వచ్చి మేమేదో పోలవరం కడుతున్నాం అని చెప్పి కలర్ కలర్ కోటింగ్ చేసే పని చేస్తున్నారు.
మీకు అవినీతి అంటే అంత ఇష్టం లేదు కదా... కానీ కళ్ల ముందు ఓటుకు నోటికి అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు మాత్రం కావాలి. మీ మాటలు అర్థం అవుతుంది ఏంటంటే మీకు అవినీతి అంటే ఇష్టం లేకపోవడం కాదు, అవినీతి మన బాబు గారు చేయకపోతే మీకు ఇష్టం లేదు.
చంద్రబాబునాయుడు గారు ఎక్స్పీరియన్స్ అని చెప్పి మీరు వాదించవచ్చు.... అటువంటప్పుడు ఒక ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ఎన్టీఆర్ గారికి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి?
మొన్నటి వరకు చంద్రబాబునాయుడు గారు వంగివంగి దణ్ణాలు పెట్టాడు కదా మోడీకి... ఆ మోడీ గారు ముఖ్యమంత్రి అయిన సమయానికి కనీసం వార్డ్ మెంబర్ గా అయినా గెలిచారా? మోడీ ముఖ్యమంత్రి అయిన సమయానికి కనీసం ఎమ్మెల్యే పదవి కూడా లేదు... ముఖ్యమంత్రి చేసిన తరువాత ఎమ్మెల్యే గా ఎన్నుకున్నారు? మరి మోడీ హయాంలో రా గుజరాత్ బీభత్సంగా అభివృద్ధి చెందిందని పచ్చ పార్టీ నేతలే గా డబ్బాలు కొట్టారు.
రేపు జగన్ వచ్చి సరిగ్గా పనిచేయకపోతే ప్రజలే జగన్ ఓటు వేయరు. కానీ మీ భయం వల్ల రేపు జగన్ వస్తే చంద్రబాబు గారి మీద కక్షతో ఆయన మీద అవినీతి కేసులు పెట్టి కోట్లు చుట్టూ తిప్పి ఆయన అవినీతిని బయట పెడతారనేది బాధ.
0 comments