రంగస్థలం సినిమా తర్వాత రామ్ చరణ్ సినిమా చేస్తున్నారంటే ఎక్కడ లేని అంచనాలు పెరిగిపోయాయి. పైగా సంక్రాంతికి సినిమా అనడంతో అభిమానులు మరిన్ని ఆశలు పెట్టుకున్నారు. మరి ఇప్పుడు వినయ విధేయ రామ నిజం చేసిందా.
కథ..
రామ్చరణ్ ఓ అనాధ.. చిన్నప్పుడే రైల్వే ట్రాక్ దగ్గర మరో నలుగురు అనాధలకు దొరుకుతాడు. దాంతో అంతా కలిసి ఒక కుటుంబంల ఏర్పడతారు. ఎలాంటి సమస్యలు లేకుండా సమస్యలు వచ్చిన వారిని తీరుస్తూ ప్రశాంతంగా బ్రతుకుతుంటారు వాళ్ళు. అలాంటి వారి జీవితంలోకి లోకి వివేక్ ఓబెరాయ్ వస్తాడు. ఎక్కడో బీహార్ లో ఉన్న ఈ పొలిటీషియన్ విశాఖపట్నం లో ఉన్న రామ్ చరణ్ ఇంటికి శత్రువు అవుతాడు. దానికి కారణం ఎలక్షన్స్. ఆ కోపంతోనే చరణ్ కుటుంబం పై పగ పెంచుకుంటాడు వివేక్. ఆ తర్వాత ఏమైంది అనేది అసలు కథ..
కథనం..
బోయపాటి సినిమా అంటే ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఒక ఐడియా ఉంది. ఆయన సినిమాల్లో కొత్త కథలు ఊహించకుండానే థియేటర్లకు వెళ్తున్నారు ప్రేక్షకులు. ఇప్పుడు దానికి తగ్గట్లే రామ్ చరణ్ కోసం కూడా ఆల్రెడీ వాడేసిన రొటీన్ రివేంజ్ కథనే మళ్లీ తీసుకొచ్చాడు బోయపాటి శ్రీను. అయితే ప్రతిసారి కథ తక్కువగా ఎమోషన్ ఎక్కువగా ఉండేది.. కానీ వినయ విధేయ రామల మాత్రం అసలు కథ లేకుండా సినిమా చేశాడు బోయపాటి శ్రీను. కేవలం రామ్ చరణ్ ఇమేజ్ ను వాడుకుంటూ ఫ్యాన్స్ కోసం వరుసగా యాక్షన్ సీన్లు ప్లాన్ చేసుకుంటూ వెళ్లిపోయాడు ఫస్టాఫ్ కేవలం ఫాన్స్ కోసమే అన్నట్లు ఉంటుంది.. కథ లేకుండా ఎంతసేపు ఒక కామెడీ సీన్ ఒక ఫైట్ ఒక ఫ్యామిలీ సీన్ ఇలా సాగిపోతుంది ఇంటర్వెల్ టైమ్కి మళ్లీ వివేక్ ఒబెరాయ్ ఎంట్రీ.. అక్కడ చిన్న వార్నింగ్ సీన్.. దాంతో సెకండాఫ్ పై ఇంకేదో ఉంటుందని అంచనాలు మొదలవుతాయి. కానీ అక్కడ ఇంకేమీ లేదని త్వరగానే అర్థమయ్యేలా చేశాడు బోయపాటి శ్రీను. సెకండ్ హాఫ్ లో కథ ముందుకి వెళ్ళాక అజర్బైజాన్ చుట్టూ తిరుగుతుంటుంది. వరుసగా యాక్షన్ సీన్ లు పెడుతూ ప్రేక్షకుల సహనంతో ఆడుకున్నాడో బోయపాటి. ఇప్పటి వరకు ప్రతి సినిమాలో ఎమోషన్ బాగా క్యారీ చేస్తాడు అనే పేరున్న బోయపాటి శ్రీను తొలిసారి పూర్తిగా డిపార్ట్మెంట్లో ఫెయిల్ అయ్యాడు. ఓవరాల్ గా ఫస్టాఫ్ సెకండాఫ్ అని కాకుండా సినిమా మొత్తంలో ఒక్కటంటే ఒక్కటి హైలెట్ సీన్ అంటూ చెప్పుకోవడానికి లేని సినిమా వినయ విధేయ రామ.
నటీనటులు..
రామ్ చరణ్ బాగా నటించాడు. అయితే రంగస్థలం సినిమా తర్వాత నుంచి అభిమానులు ఊహించిన సినిమా ఇది మాత్రం కాదు. మరోసారి పూర్తిగా రొటీన్ ఫార్మేట్ లోకి వెళ్లి ఉత్సాహపరిచాడు మెగా వారసుడు. కైరా అద్వాని కేవలం పాటలకు మాత్రమే పరిమితమైపోయింది. వివేక్ ఒబేరాయ్ విలన్ గా బాగున్నాడు.. ప్రశాంత్ స్నేహ ఆర్యన్ రాజేష్ ఇల్లంతా తమ తమ పాత్రల్లో మెప్పించారు..
టెక్నికల్ టీమ్ లో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం విషయంలో పెద్దగా ఆకట్టుకోలేదు.. పాతపాటలు మరోసారి ఇచ్చి అంతగా మార్కులు వేయించుకోలేదు.. ఎడిటింగ్ చాలా వీక్ గా ఉంది.. దర్శకుడు బోయపాటి శ్రీను పూర్తిగా విఫలమయ్యాడు. పాత కథ కావడం రామ్ చరణ్ వినయ విధేయ రామలకు ప్రతి కులం.
చివరగా.. బోయపాటి కత్తికి బలైపోయిన వినయ విధేయ రామ..
రేటింగ్: 2.5/5
0 comments